యుద్ధ కాండ - 3

 యుద్ధ కాండము - తృతీయాశ్వాసము

738-

విలసుధాకరవదనా!
సునశ్చేతోబ్జసదన! సుస్థిరకదనా!
నీయరదన! శత్రువి
రఘుకుల సార్వభౌమ! జానకిరామా!

739-వ.

శ్రీనారద మునీంద్రుండు వాల్మీకి కెఱింగించిన తెఱం గెఱింగించెద నాకర్ణింపుము.

రావణుని శత్రుంజయ హోమము

740-క.

కల పక్షులు గూయఁగఁ
పలనై తారకములు డమటఁ దోఁపన్
జములు విరియఁ దూర్పున
పలనై తెల్లవాఱ భానుఁడు పొడమెన్.

741-సీ.

ట మున్ను దశకంఠు డాచార్యుఁడైనట్టి-శుక్రానుమతి దేహశుద్ధితోడ
ణజయార్థంబుగా థములు గుఱ్ఱముల్-వచంబు లస్త్రసంములు గలుగఁ
బాతాళగుహఁ జొచ్చి వీతిహోత్రునిఁగూర్చి-పాయక హోమంబు సేయుచుండ
నాహోమధూమంబు లాకసంబునఁ బర్వఁ-ని విభీషణుఁడు భూకాంతునకును

విన్నవించెను మాయన్న నిన్న నరిగి
హోమ మొనరింపుచున్న వాఁ డుడుగ కిపుడు
మొనసి యా హోమ మది తుద ముట్టెనేనిఁ
గలన బ్రహ్మాదు లాతని గెలువలేరు.

742-క.

ని విఘ్నము సేయఁగ
భూపాలక! కపుల నేర్చి పుచ్చుము లేదే
మీని విఘ్న మగు ననుడు
భూపాలవరేణ్యుఁ డపుడు భూధరచరులన్.

743-చ.

య గవాక్ష వాలిసుత కంజహితాత్మజ నీల వాయుసం
నల గంధమాదన విభాషిత భల్లుకనాథ ముఖ్యులన్
దివిజ విరోధిపైఁ బనుపఁ దీవ్రత నేఁగి పురంబు సొచ్చి దా
పతి సేనలం దఱిమి నాకము భేదిల నార్చి యత్తఱిన్.

744-క.

గు సొచ్చి దనుజవల్లభ!
విహితమె సాహసము విడిచి విను మునివృత్తిన్
నగతధూతరేఖల
రహమును నీకు వ్రేల్వ ర్హంబగునే.

745-క.

గఁటిమి గలిగినపురుషులె
తనమును విడిచి నడువ గువలు నగరా
 దనక నేఁడు మఱుగున
వితవ్రీడుండ వగుచు వేల్వం దగునే.

746-మ.

ని కేతెంచి నృపాల శేఖరుఁడు వాహ్యాళిప్రదేశంబునన్
నిను రమ్మంచును బిల్చుచుండ నిచటన్ నీవుండి వ్యాజంబునన్
నుజాధీశ్వర! వీరధర్మ మగునే ప్పించుకో నంచు న
వ్వచారుల్ సిగవట్టి యీడ్వగను గ్రవ్యాదుండు నిశ్చింతుఁడై.

747-క.

లక హృదయజ్ఞానము
లక మంత్రంబుచొప్పు డి తప్పక లోఁ
జెరక వ్రేల్చుచు నుగ్రత
జెరక కూర్చుండె నట గభీరప్రౌఢిన్.

748-వ.

అట్లు శిలాస్తంభంబుపగిదిని జలింపకున్న నతనిచేతి యాహుతులు విడిచి పో వైచి స్రుక్స్రువంబులు నలుఁగఁ ద్రొక్కి యిధ్మంబు హోమద్రవ్యంబులు నొక్కింత నగ్నిలోఁ ద్రోచి హోమాగ్నిం జిందఱవందఱ చేసి భుజంబు లెక్కి మీసలు పట్టుకొని లాగి తలలు గదలించి వీనులఁ బెనుబొబ్బలిడి కదలకున్నం గినిసి వాలితనూభవుండంత నంతఃపురంబునకుం బోయి యందున్న మందోదరినిఁ జుట్టుపట్టి యీడ్చుచు బరువునఁ గొని వచ్చి దశవదనుముందఱ నిలుప నక్కాంత దుఃఖాక్రాంతయై తనకాంతున కిట్లనియె.

మండోదరి దీనాలాపములు

749-తే.

రామచంద్రుండె యాదినారాయణుండు
పులె దేవత లని నీకుఁ నఁబడంగ
నెల్ల వేళల నేఁ జెవి నిల్లు గట్టి
విన్నపము సేయ నామాట వినకపోతి.

750-మ.

దైత్యేంద్రునకుందనూజ నయి సేమంబొప్ప నీపత్నినై
వెట్టంగను నింద్రజిజ్జననినై ర్వాంగనాపూజ్యనై
 మెన్నండు నెఱుంగనట్టినను నిబ్భంగిన్ వనాటుండు ని
ర్భవృత్తిందలవట్టి యీడ్వఁగనుఁ గోఁబాలైతి నీముంగలన్.

751-క.

రాముని దూతలు నన్నును
బాములు వెట్టంగఁ జూడఁ బండువె నీకున్
నామానము గాపాడని
నీ మానుష మేటి కిపుడు నిర్జరవైరీ.

752-ఉ.

 మునివృత్తికన్న దనుజేశ్వర! రామునితోడ నేఁడు సం
గ్రాము సేసి గెల్చిన నఖండరమావిభవంబు గల్గు నా
రామునిచేతఁ జచ్చిన స్థిరంబగు మోక్షము గల్గు దీనికై
యేమిటి కింతదైన్యమిసి యిచ్చఁ దలంపుము రాక్షసేస్వరా.

753-వ.

అని యినేక విధంబులుగా దీనాలాపంబు లాడుచు వెక్కి వెక్కి యేడ్వం గని లజ్జించి మహోగ్రాకారుండై లేచి దగ్ధశేషకాండంబులచే వానరవీరుల కరంబులు శిరంబులు ముక్కులుఁ జెక్కులు నలుఁగ మొత్తినం బఱచి వారు రామచంద్రుని సమ్ముఖంబునకుం బోయి తాము పోయి వచ్చినపని విన్నవించి రట్టి సమయంబున.

754-తే.

గచరులఁదోలి క్రమ్మర గరి కరిగి
పంక్తికంఠుడు ధైర్యంబు పాదుకొల్పి
విన్నఁదనమున వగపునఁ జిన్నవోయి
చెంత నున్నట్టి తనకులకాంతఁజూచి.

755-క.

నాకేలు వట్టి వెలసిన
నీ కేలా చిన్న వోవ నీరజనయనా!
నాకులు బెదరఁగ నల యి
క్ష్వాకుకులోద్భవుల గెలిచి చ్చెద నింకన్.

756-తే.

తెలియు మయుపుత్త్రి! నాదు ప్రతిజ్ఞ వినుము
నచరులతోడ రామభూరుని నేఁడు
చంపుటొండెను వానిచేఁ చ్చుటొండెఁ
గాని యూరక మరలుట కానిమాట.

757-వ.

అని వీరరసం బుప్పొంగఁ బ్రతిజ్ఞాలాపంబులఁ దనపట్టపుదేవి యగు మందోదరి నోదార్చి కొలువుకూటంబున కేతెంచి యచ్చట.

రావణుని సమర సంరంభము

758-క.

శిముల వీనుల గళములఁ
ముల నురమున నడుమున మనీయపదాం
బురుహముల భూషణావళు
రుదారఁగఁ దాల్చి మోహనాకృతి మీఱన్.

759-తే.

గంధమాల్యాంబరాదులు బంధురముగ
మేనఁ గలయంగ ధరియించి దానవేంద్రుఁ
డంత రణభేరి వ్రేయించి పంత మలర
బిరుదు రాహుత్తవీరులఁ బిలువఁ బనిచె.

  టీక -  రాహుత్తు- గుఱ్ఱపురౌతు

760-వ.

అట్టి యవసరంబున.

761-ఆ.

రోష మడర ఖడ్గరోముండు వృశ్చిక
రోముఁ డల్ల సర్పరోముఁ డగ్ని
ర్ణుఁడాది గాఁగ చ్చిరి రాక్షస
వీరు లపుడు దనుజవిభునిఁ గొలువ.

762-క.

రువది చేతులశస్త్రో
త్కములు మెఱయంగఁ దాల్చి కౌతుక మడరన్
దుగములు నూఱు గట్టిన
దముపైఁ గూరుచుండ తివిభవమునన్.

763-సీ.

భేరులు తమ్మటల్ పెల్లు నిస్సాణముల్-బూరగొమ్ములు కంచువీరణములు
కిల క్రోవులు వీరద్దెలల్ గిడుగిళ్ళు-పేరైనతప్పెటల్ పిల్లఁ గ్రోళ్ళు
తారలు చిమ్మటతారలు శంఖముల్-కాహళాల్ పసిడిఁఢక్కలును బిడులు
గాలిగొమ్ములు డోళ్ళు కైవళ్ళు రుంజలు-త్రసంఘంబులు చామరములు

బోరు కలఁగంగ దిక్కులు బూరటిల్ల
నుజవర్గంబు లిరువంకఁ విలి కొలువ
వెడలె సన్నాహ మడరంగ వీరరవము
దుపు గట్టిన చందంబు గానఁబడఁగ.

            టీక -భేరీ- దుందుభి, తమ్మట- తమ్మని శబ్దంచేసే తుముకు, చర్మవాద్యము, నిస్సాణము- రెండుప్రక్కల వాయించు పెద్ద డోలు, బూరకొమ్ము- కంచు కొమ్ముబూర, వీరణము- డోలువాద్య విశేషము రెండుప్రక్కల వాయింతురు, మకిలి క్రోవు- నల్లని మురళి, వీరమద్దెలు- రాజుల జయచిహ్నపు కాలివ్రేళ్ళ సెల్లాలు, గిడుగులు- కామలేని గొడుగులు, పిల్లగ్రోవి- పిల్లనగ్రోవి, చిన్న మురళి, తార- సుషిరవాద్య విశేషము, కాహళము- బాకా ఊదెడు కొమ్ము, ఢక్క- డంకా, పిడి- వాద్యవిశేషము, గాలికొమ్ము- ఊదే బూర, రుంజ- నక్కజంగాలు వాయించు రెండుప్రక్కల వాయించే చర్మవాయిద్యము, బోరు- హోరుమను ధ్వని.

764-క.

కాలాగ్ని కాల భైరవ
కాలాంతక కాలగండ కాలాహికళా
భీ సముద్యద్దినకర
కాలాకృతితోడఁ బంక్తికంఠుఁడు వెడలెన్.

765-వ.

ఇట్లుత్యుత్సాహంబుగా యుద్ధరంగంబునకు బయలుదేఱిన సమయంబున.

వందిచేసిన రావణుని స్తుతి - చూర్ణిక

766-చూర్ణిక.

జయజయ కైకసీగర్భసముద్ర సంపూర్ణ సుధాకరా!

జయజయ మయతనూజామనోహరా!

జయజయ రాక్షస కులసార్వభౌమా!

జయజయ సాగరావరణలంకేశ్వరా!

జయజయ పాకశాసనభద్రశ్రీహరణచతురా!

జయజయ కుటిలవైశ్వానరపుటభేదనిర్ధూమధామా!

జయజయ సమవర్తి సంపద్విచ్ఛేదకా!

జయజయ దనుజవల్లభహల కల్లోలా!

జయజయ యబ్ధీశ్వరతోయశోషణబడబానలా!

జయజయ పవమానసంహారా!

జయజయ యక్షనాయక దుర్వారగర్వాపహారకా!

జయజయ యీశానైశ్వర్యహరణోద్యమా!

జయజయ నవగ్రహానుగ్రహనిగ్రహా!

జయజయ దశగ్రీవాలంకారా!

జయజయ కైలాస నగేంద్రోత్పాటనకందుక క్రీడావినోదా!

జయజయ భవానీశ్వర శ్రీపాదకమలశిరఃకంజాతపూజాసమర్థా!

జయజయ పుష్పకారూఢ సకలదిగంతవిక్రాంతా!

జయజయ బ్రహ్మవంశప్రదీపకా!

జయజయ త్రిలోకవిజయా!

రావణేశ్వరా! జయీభవ దిగ్విజయీభవ.

767-వ.

అని వందిబృందంబు లుభయపార్శ్వంబుల జయజయ ధ్వనులతో బిరుదుగద్యపద్యంబులు వక్కాణింప ముక్తాతపత్రంబుల నడుమ మహిళామండలార్పితచామరపవనకంపిత కుంతలుండగుచు వీరరసంబు పురుషాకారంబు దాల్చినలీల నేతేర ముజ్జగంబులు గడగడ వడంకెఁ గులాచలంబు లొడ్డగిల్లెఁ జంద్రార్క మండలంబులు తడఁబడె నక్షత్రంబులు డుల్లెనట్టి సమయంబునఁ గరిబృంహితంబులు నశ్వహేషారవంబులును దనుజభటాట్టహాసంబులును సురత్రాసజనకంబులుగాఁ బటహ నిస్సాణ భేరీ శంఖ కాహళ భాంకార రవంబులును బ్రతిధ్వనుల నీన నంత రావణుపై మేఘంబులు రక్తధారలు వర్షించె బిరుదధ్వజంబులు విఱిగిపడియెఁ దురంగంబుల వాలంబులనుండి నిప్పు లురలె దిక్కుల ధూమంబు నిబిడంబై పర్వె నట రామునిచే రావణుండు తెగుట యవశ్యంబని నభంబును మ్రోసె నట్టి సమయంబున.

768-క.

భూనాయకుఁ డతివేగమ
దావసేనలకు నెదురు దార్కొని పోరన్
వారసేనలఁ బంపెను
భానుజముఖ్యాధిపతులఁ బౌరుష మడరన్.

769-మ.

రుశైలంబులతోడనార్చుచు భుజార్పంబు లుప్పొంగ వా
వర్గంబు లెదిర్చి వచ్చునెడ నానాకారు లాదక్షిణో
త్తవార్ధుల్ ప్రకటించి డాయుగతి నుద్యత్ప్రౌఢిఁదార్కొంచు సం
ముంజేయఁగఁజొచ్చిరంతసురలాకాశంబునం జూడఁగన్.

770-సీ.

రుల నెక్కించి భీరలీలఁ ద్రొక్కించి-వాజులఁ దోలి తీవ్రముగ నేయ
థములఁ బఱపి శిరంబులఁ జక్కాడి-చెలఁగి పదాతులఁ జేరి పొడువఁ
బంతంబు చేకూఱఁ బ్లవగోత్తములఁ గేరి-రువులుఁ బాషాణతులుఁ బఱపి
శైలంబు లడరించి సంహారములు సేయఁ-లఁగక దైత్యులుఁ పులు గలసి

పోరునప్పుడు వానరవీరు లసుర
రులమీఁదను భాషాణర్ష మధిక
లీలఁ గురియింపదనుజు లావేళ విఱిగి
లలు వీడంగఁ బఱచిరి త్తరమున.

771-సీ.

మెండైన రథముల మీఁదికిఁ గుప్పించి-విక్రమ ప్రౌఢిమై విఱుగఁ ద్రొక్కి
కరులకొమ్ములు పట్టి బిరబిర వడిఁ ద్రిప్పి-గతీస్థలంబున దియఁ గొట్టి
తొడరి సైంధవకోటి తడకాళ్లు విదళించి-ట్టి పెన్ జెక్కలు వాఱఁగొట్టి
కాల్బలంబులపైకిఁ దిసి శస్త్రంబుల-తోడఁ గూడనె చుట్టి తునియఁ గొట్టి

త్రములు గూల్చి చామరమితి విఱిచి
కెరలి యార్చుచు బిరుదుటెక్కెములు చించి
వాద్యసంఘంబు లవలీల సుధఁ గూల్చి
పులు దోలిరి దానవణము నెల్ల.

హనుమంతునిచే ఖడ్గరోముని ఖండనము

772-ఆ.

అంతఁ బంక్తివదను రదంబు నెదురుగా
డుచు వాయుపుత్త్రుకును ఖడ్గ
రోముఁ డనియె నతని రూపించి నా తోడ
ణము సేయ వేగ మ్మటంచు.

773-చ.

పిలిచిన రోష మెత్తి కడు భీకరవృత్తిని ఖడ్గరోముతోఁ
పడ వానిరోమములు దాఁకి శరీరము నొచ్చి యంతలో
 నొకపర్వతంబు గొని పావని దైత్యునిమీఁద నేయ ని
శ్చతను ఖడ్గరోముఁడును క్కుగఁజేసినఁ దత్క్షణంబునన్.

774-చ.

ఱియొక పర్వతంబు హనుమానుఁడు గైకొనివచ్చి క్రమ్మఱన్
మెవడిఁ ద్రిప్పి తద్రథముమీఁదను వైచిన వజ్రధారచేఁ
ఱియలువాఱి ధాత్రిఁ బడుర్వతమో యనఁ దేరితోడ ని
ర్భముగ ఖడ్గరోముఁడు సపాటగఁగూలె దురంబులోపలన్.

సర్పరోమాదుల సంహారము

775-ఆ.

రోజి కలన ఖడ్గరోముండు గూలుట
ర్పరోముఁ డెఱిఁగి సాహసమున
వాలిసుతుని దాఁక వాని రోమంబుల
విషము సోఁకి నొచ్చి వేగఁ దెలిసి.

776-క.

లోన సర్పరోమునిఁ
దూలించుచు వానిముక్కుదూలము పగులన్.
వాలితనూజుడు దన్నినఁ
జాలంగా నొగిలి తెలిసి సాహస మొప్పన్.

777-ఉ.

వాలితనూజు నెన్నుదురు వ్రక్కలువాఱఁగ సర్పరోముఁడా
భీత నార్చి చేకొలఁదిఁ బేర్కొని కొట్టిన రక్తధారలన్
దేలుచు నంగదుం డతని డీకొని పూని శిరంబు చెక్కలై
వ్రీలి పడంగ గొట్టఁ బృథివీస్థలిఁ గూలెను సర్పరోముఁడున్.

778-క.

లోన సర్పరోముఁడు
గూలుట కనుఁగొనుచు మిగుల గోపంబునఁ దా
నా
లో వృశ్చికరోముఁడు
నీలునిపై రథముఁ దోలె నిర్భయవృత్తిన్.

779-ఉ.

బోన నీలుఁ డంత నొకభూజముఁ గైకొని వాని తేరిపై
శూత నేసి యాక్షణము చూర్ణముగా నొనరింప నేలకున్
ధీతదాఁటి భూరుహముఁ ద్రెంచఁగనుంగొని నీలుఁడొక్క మం
దా మహీజమున్ వయిచె ధారుణి వృశ్చిక రోముఁడీల్గఁగన్.

780-సీ.

వృశ్చికరోముఁడావేళఁ ద్రుంగుటఁ జేసి-డి రోషమున నగ్నిర్ణుఁ డడరి
త్రేతాగ్ను లొక్కఁడై తెరలి మండినలీలఁ-నమేని మంటలు రికొనంగ
రావణునెదురఁ బరాక్రమస్థితిఁ బేర్చి-రామచంద్రునిమీఁద థముఁ దోలి
ప్రల్లదంబునఁ బెక్కుభాషలు నుడువుచు-సాయక నిచయంబు లేయునెడను

వాని శౌర్యంబుఁ దెంపును వానిబలముఁ
జూచి భూపాలుఁ డప్పుడు చోద్యపడుచు
నువు నందును వారుణాస్త్రంబు దొడిగి
గ్నివర్ణునితలఁ ద్రుంచె నాక్షణంబ.

781-తే.

గ్నివర్ణుండు తెగిపోవు సురవరుఁడు
న్నులారంగఁ గనుఁగొని లుషవృత్తి
రామచంద్రుని డాయంగ థముఁ బరపి
లికె నుత్కటగర్వ ప్రభావుఁ డగుచు.

782-క.

జాకుమా బీరము చెడి
పాకుమా రిపులు నవ్వ యపడి వనమున్
దూకుమా పేర్కొంచును
జీకుమా కపులఁ దోడు చేకొని పోరన్.

783-మ.

ని విల్లెక్కిడి దైత్యనాయకుఁడు రోషాయత్త చిత్తమ్మునన్
మౌర్వీనినదంబు భీకరముగాఁ గావించి పెల్లార్చి య
జ్జనాథాగ్రణిమీఁద నుగ్రశరముల్ సంధించి బిట్టేయఁగా
వినువీథిన్ సురసంఘముల్గొలువఁగా వీక్షించె దేవేంద్రుఁడున్.

784-వ.

ఇట్లు కనుంగొని.

శ్రీరామచంద్రున కింద్రుఁడు రథమును గానుకగాఁ బంపుట

785-క.

 మెక్కి రావణుండును
బృథివీస్థలి నుండి రామపృథ్వీపతియున్
బ్రనము సేయుట తగ దని
వ్యథఁ బొందుచు నాత్మలోన వాసవుఁడంతన్.

786-క.

మాలిచేతను గవచము
చాతుర్యము గలుగు రథము చాపము శరమున్
భూలనాయకునకుఁ బురు
హూతుఁడు పుత్తెంచెఁ గడు మహోన్నత మహిమన్.

787-వ.

ఇట్లు పుత్తెంచిన.

788-చ.

ణికి వచ్చి మాతలి ముదంబున రామునిఁ జూచి మీకుఁగా
సుపతి పంపినాఁ డధికశోభనకృత్యములై వెలుంగు నీ
ములు విల్లు వజ్రకవచంబును దేరును వీనిచేత సం
మున దైత్యునిం దునిమి కైకొను రాఘవ! శ్రీజయంబులన్.

789-వ.

అని చెప్పిన మాతలి ప్రియవచనంబులకు సంతసించి విభీషణానుమతంబున రామభూపాలుండు వజ్రకవచంబు దొడిగి శరశరాసనంబులు గైకొని యింద్రస్యందనంబునకు వలగొని వందనం బాచరించి బాలాదిత్యుండు పూర్వ పర్వతం బెక్కుచందంబున రథం బెక్కునంత జయజయధ్వనులతో సుగ్రీవాంగద హనుమదాదులైన వానరవీరులు మ్రొక్కి రప్పుడంతరిక్షంబున దేవసంఘంబులు సంగ్రామరంగంబుఁ జూడ వేడ్కపడి వచ్చి విమానంబులతోఁ గ్రిక్కిఱిసి చూచుచుండి రాసమయంబున.

రామ రావణుల నిరుపమ మహా సమరము

790-క.

గిరిగిరి నభము నభంబున
 ధరయును జలధి జలధి దార్కొనురీతిన్
సురిపుఁడు నసురరిపుఁడును
దుమున నెదురించి రధికదోర్బలయుక్తిన్.

791-వ.

ఇట్లు మార్కొనుచు.

792-శా.

వీరాలాపము లాడుచుం గదిసి దోర్వీర్యంబుతోడన్ దను
ర్జ్యారావంబులు మిన్ను ముట్టనతితీవ్రం బైన శబ్దంబులన్
వారాసుల్ కలఁగంగనార్చి నిజగర్వస్ఫూర్తి నుప్పొంగుచున్
గ్రూరాస్త్రంబులనేసి రొండొరులపైఁ గోదండపాండిత్యులై.

793-క.

నుజేశుఁ డేయుశరమును
నుజేశుఁడు తప్పఁ ద్రుంచు మార్కొని కడిమిన్
నుజేశుఁ డేయు శరముల
నుజేశుఁడుఁ దప్పఁ ద్రుంచుఁ తభుజశక్తిన్.

794-క.

కంటున వేసినశరములు
వింటన్ దప్పించుకొనుచు వెస బాణములన్
గెంటింపుచు దమగాత్రము
లంక యుండంగ నేటులాడిరి కడిమిన్.

795-క.

మొల నొకబాణ మావలఁ
దులును బదిపదులు వేయిఁ దివేలును నేఁ
దివేలు లక్ష కోటియుఁ
జెరక విలుకాండ్రమీఁద శీఘ్రమ పర్వెన్.

796-క.

తొడిగినబాణము వింటను
దొడిగినయట్లుండు మిగుల దోడ్తోనవలన్
వెలెడుశరములు లెక్కకుఁ
గుఱుతన రాక చిత్రతులన్ బర్వెన్.

797-వ.

అట్టి సమయంబున.

798-చ.

వ మురాంతకాదులు మహాత్ములు వింటికి వారికన్ననున్
త్రిభువనమందు వీరె గణుతింపఁగ నెక్కుడటంచు మెచ్చుచున్
మున నుండి ప్రస్తుతి ఘనంబుగఁ జేతురు దేవకోటు ల
ట్లుయ బలంబులం బొగడుచుందురు రాముని రావణాసురున్.

799-చ.

నువుల మ్రోత మేఘనినదంబులుగా శరదీప్తి జాలముల్
వరచంచలావళులుగా మణిమౌక్తికదీప్తి ధాత్రిమీఁ
ను వడగండ్లుగా క్షతజధారలు సంతతవర్ష ధారగా
యముఁ జెప్ప నొప్పె విపులాహవమప్పుడు వానకాలమై.

  టీక -   చంచలా- మెఱుపు, తటిత్తు, సౌదామని

800-తే.

పంక్తికంఠుండు మిగులఁఁ గోపంబు గదురఁ
దేవగంధర్వశరము సంధించి తివిచి
రామ భూపాలుమీఁద విక్రమము మెఱసి
వేసి వడి నార్చె దిగ్దంతివిసర మడల.

801-క.

దానికిఁ బ్రతిశర మప్పుడు
మావనాథుండుఁ దొడగి మానుష మడరన్
బూనిక నేసిన దానిం
బోనీయక త్రుంచి వైచె భువనము లలరన్.

802-క.

త్రుంచినఁ గనుఁగొని దనుజుఁడు
మించినకోపమున రాముమీఁదను వడి సం
ధించి స్ఫురద్విషబాణము
వంచింపక యేయ దానిలనన్ జాలన్.

803-ఆ.

నాగశరము లొదవి నానాముఖంబుల
చ్చునపుడు మనుజల్లభుండు
రుడబాణ మేసి ఖండించె నన్నింటి
మింట సురలు సూచి మెచ్చి పొగడ.

804-చ.

ది వృథవోయినన్ దనుజుఁడాగ్రహమూని కరత్రిశూలమ
య్యనునఁ ద్రిప్పివైవ విపులార్చులఁబేర్చుచువచ్చుదానిపై
లక ముందుగాఁ ద్రిదశల్లభుఁ డిచ్చినశక్తి నేసినన్
బొలుచుఁ బాఱి త్రుంచె మణిభూషణజాలమునాత్రిశూలమున్.

805-వ.

అట్లు శూలంబును దూలఁనేసి.

806-క.

సూతుని రథమును వాజులఁ
గేతువుఁ దూలంగ నేసి కినుక మెయిం జే
సేను నొప్పించిన నృపుఁ
డాఱి దైతేయవిభుని ద్భుత మడరన్.

807-క.

సూటి గొని యసుర తలల కి
రీము లవలీల డుల్లిరివ్వున నొసలున్
బీలు వాఱ శతాంగము
ఘోకములగుండె లవిసి కూలఁగ నేసెన్.

808-ఉ.

యెడ దైత్యనాయకుఁ డహంకృతి రామునిమేన నాటఁగా
వేయుశరంబు లాయముల వేగమె గాఁడిన రక్తపూరముల్
కాము దొప్పఁదోఁగఁవడిఁ గ్రమ్మెడు నప్పుడు గూడ నొప్పెఁ బ
ద్మాత లోచనుండు చరమాద్రితటిం దగు భానుఁడోయనన్.

809-ఆ.

అంత రామచంద్రుఁ త్యంత కుపితుఁడై
బాణవృష్టిఁ గురియఁ బంక్తిముఖుఁడు
కాలు వ్రేలు చెయ్యి దలింప నోపక
మెదల లేక రథముమీఁద నొరిగె.

810-వ.

రావణుండు సొమ్మసిల్లిపోవు టెఱింగి కాలకేతుఁడు తేరు దూరంబుగాఁ గొనిపోయినఁ గొంత ప్రొద్దునకు దనుజేంద్రుండు మూర్ఛ దేరి యోరీ! పగవారలు నవ్వఁ దగదనక రథం బిట్లుఁ తేఁ దగునే యని కోపించినఁ గాలకేతుండును యుద్ధమధ్యంబున దేవరకు సంకటం బైన రథంబు వెడలఁ గొనిపోవుట యోటమిగాదని ధర్మవిదులు సెప్పుదురు గావున నే నిట్లు దెచ్చితి నని విన్నవించిన సూతుని వాక్యంబులకు మెచ్చి పసదనంబు లిచ్చి మనరథంబు రాముని పయిం బఱపు మనిన నట్ల కావించినన్‌ గనుంగొని.

            టీక -   పసదనము- బంగారము

811-క.

ని రథమున కెదురుగ
మాలి! మనరథముఁ బఱపుమా యన నతఁడున్
వే తీవ్రగతింబఱపిన
భూలపతి వలికె దనుజపుంగవుతోడన్.

రామ రావణుల వీరాలాపములు

812-ఉ.

భూరి భుజప్రతాపమునఁ బొంగుచు నిర్ఝరకోటి మాటికిన్
బో జయించి తంచుఁ బలుపోకలు పోదువు నీవు భీతిమైఁ
దాక నిల్చి నాయెడఁ బ్రతాపము సూపుము చూపవేని నా
వారిజ గర్భుఁ డడ్డుపడ చ్చినఁ జంపుదు నిన్ను రావణా!

813-ఉ.

ములోన వానరుల నాలము సేసినయట్లు గాదు నా
పాలిశరంబు నీనుదుటి వ్రాలు హరింపఁగఁ బాలుపడ్డ దీ
వే వృథాపహాస్యములు వేయివిధంబుల మానలేక తాఁ
గాలుఁడు కన్నుగీటె నిదె కాలము డగ్గఱె నీకు రావణా!

814-చ.

రి గిరి వహ్ని గిహ్నిఁ బ్రళయాంతకుఁ గింతకు దైత్యు గీత్యు వా
ర్వరుగిరు గాడ్పు గీడ్పు ధనల్లభు గిల్లభు రుద్రు గిద్రు సం
మున నోర్చినట్టి దశకంధర! నీకు జయింప వచ్చునే
సునగధీరు నుగ్రరణశూరుఁ బయోధిగభీరు రాఘవున్.

815-క.

తిఁ దలఁప సుఖరతిం బతి
వ్రలను మునివరులఁ బట్టి వ్రతములు గర్వో
న్నతిఁ జెఱచినట్టిదురిత
స్థితి నిప్పుడు నీవు నాకుఁ జిక్కితి విచటన్.

816-వ.

అని గర్వాలాపంబు లాడుచున్న యుర్వీశునకుఁ బూర్వ గీర్వాణాధీశ్వరుం డగు రావణాసురుం డిట్లనియె.

817-క.

అంటి భూరిపరాక్రమ
వంతుఁడ వౌ టెఱుఁగుదేని సుధేశ్వర! నా
పం మెఱింగియు నెఱుఁగక
యిం ప్రగల్భముల నాడ నేటికి నీకున్.

818-క.

నీలావును నాలావును
వాలాయము సురలు సూచి ర్ణింపఁగ నేఁ
డాములోపలఁ జూపుద
మేలా గర్వోక్తు లిప్పు డినకులతిలకా!

819-మ.

నాథాగ్రణి! నా ప్రతిజ్ఞ వినుమా శాంతాత్ముఁడై నీకునై
జాప్తుం డిట వచ్చి కావు మనుచున్ వైళంబ నన్ గోరినన్
వినువీథిన్ సుర లెల్లఁ జూచి వెఱవన్ బీరంబు సంధిల్లిఁగా
నిను నీతమ్మునిఁ జంపకుండ మరలన్ నే లంకకుం బోఁజుమీ.

820-వ.

అని కోపోద్దీపితమానసులై వీరాలాపంబు లాడుచు నిద్దఱును నుద్దవిడి గద్దింపుచు నోలమాసగొనక మీఱిన కోపంబున శరీరంబులు మఱచి జయోల్లాసంబు లుల్లసిల్ల నొసళ్ళఁ బొడముపెన్‌ జెమట మొత్తంబులును రక్తపూరంబులునున్‌ బెరసి కాలువలై పాఱుచుండ మెఱుంగు కఱకు టంపగములు నాటినం జుఱు కెఱుంగక తమకంబులను నిష్ఠుర బాణ సంఘట్టనంబులను బృథులరథనేమిస్వనంబులను ద్విసహస్ర తురంగ హేషారవంబులను భటుల సింహనాదంబులను గగనంబు వగుల జగంబులు కలంగ సముద్రంబులు ఘూర్ణిల్ల ధాత్రి వడంక దిగ్గజంబులు మ్రొగ్గతిల్లఁ బడ నభోభాగంబున దేవ గంధర్వ సిద్ధసాధ్యకిన్నరకింపురుషాదులు సూచి వెఱంగుపడ నిది పగ లిది రాత్రి యని యెఱుంగక తమకంబున నే డహోరాత్రంబులు పోరాడి యలసి బాణప్రయోగంబు లుజ్జగించి యొకరి నొకరు సూచుచుండ నయ్యవసరంబున.

తెగిన తోడనే మరల మొలుచుచున్న రావణుని శిరములు

821-క.

సీరుహమిత్త్రాన్వయుఁ
రుదరుదని సురలు వొగడ సురేశ్వరున
క్కములు శిరములుఁ దెగిపడ
నురుముష్టిని దీసి వేగ నుగ్రాస్త్రములన్.

822-క.

తెగి పడినతలలుఁ జేతులు
దెగినట్లే మొల్చుచుండఁ దీవ్రత యడరన్
దీశుఁ డపుడు మదిలోఁ
దె కుండుట చిత్ర మనుచు దీకొని మఱియున్.

823-క.

కోలఁ దలలుఁ జేతులుఁ
బ్రటంబుగఁ ద్రుంచినంత బాహులుఁ దలలున్
విచాంబుజములరీతిని
లేశుఁడు వెఱగుపడఁగఁ య్యన మొలిచెన్.

824-క.

తొడిగెడి శరములు ధరపైఁ
డియెడు మస్తకము లేరుడ కుండఁగ న
ప్పుడు రామమహీతలవరుఁ
డెతెగ కుండంగ నేసె నేమని చెప్పెన్.

825-వ.

అట్టి సమయంబున.

826-ఆ.

వింటఁ దొడుగుశరము వెడలెడుశరమును
దిరుగ మొలుచుతలలుఁ దెగినతలలు
నెట్టివారి కైన నెఱుఁగంగ రాకుండ
రాముఁ డేయఁ దొడఁగె ణములోన.

827-ఆ.

రము దొడిగి తివియఁ క్రంబువలె నుండు
రము విడుచునపుడు చాప మగును
జూడ నొప్పె నౌర శోభితం బగు రాము
చేతివిల్లు సెప్పఁ జిత్ర మగును.

828-ఉ.

కాంనపుంఖదివ్యవిశిఖంబుల బాహులు మస్తకంబులున్
ద్రెంచినఁ ద్రెంచినట్లె కడుఁదేజ మెలర్పఁగ నుద్భవించు స
త్కాంనరత్నభూషణ నికాయము దీప్తులు ప్రజ్వరిల్లఁగాఁ
గాంనగర్భ దత్త వర ర్వ విశేషముచేత సారెకున్.

829-చ.

పొరిఁబొరిఁ ద్రుంచినన్ దిరిగి పుట్టెడు చందముఁ గోల నారిపై
వెపుగఁ బూనుచందమును వేసెడు చందముఁ బాఱుచందము
న్గము నుతింపఁగా నరుదుగాదె తలంపఁగ దేవతాళికిన్
శిముల చిత్రమున్ నృపునిచేతి విచిత్రము తూపుచిత్రమున్.

830-ఉ.

రాణుఁడేయు బాణములు రాముని బాణము లొక్కపెట్టునన్
రాణు మేన నాటియును రామునినాటియు రక్తపూరముల్
పూవులతోడిమోదుగను బూర్వగిరీంద్రము మీఁది భానునిన్
జేవురుకొండ కాలువలసిందురమున్ దలపించు నెంతయున్.

831-క.

త్తిలి రాముఁడు దైత్యుని
కుత్తుక నొకకోలఁ ద్రుంచి కూల్చుట దొడ్డో
నెత్తురు గ్రమ్మకమున్నే
మొత్తములుగఁ దలలు మరల మొలచుట దొడ్డో.

832-వ.

అని దేవసంఘములు గొనియాడ శ్రీరామచంద్రుండు దైత్య నాయకుని తలలుఁ జేతులుం ద్రుంచి త్రుంచి విసివినం గని విభీషణుండు నరేంద్రున కిట్లనియె.

విభీషణుఁడు తెలిపిన రావణ మరణ రహస్యము

833-క.

పోలఁగ నాతనినాభీ
మూలంబున నున్న యమృతమును మొదలను ని
ర్మూముగా శ్రీరఘుభూ
పాక! తెగఁ వ్రేయు మగ్ని బాణముచేతన్.

834-క.

ది తెగిపోయిన పిమ్మటఁ
దితలలును రెట్టి గలుగు బాహులు మరలన్
జెరక తునుమఁగఁ దునుమఁగ
దుది ముట్టఁగ మొలుచు నూటతొమ్మిదిమారుల్.

835-వ.

అంత నంతంబౌ నని విన్నవించిన విని రామభూపాలుం డట్లు గావించిన.

836-క.

తలయు రెండు చేతులు
లంకస్థితిని గల్గుట్లితనిన్ నేఁ
డొతలఁకు దెచ్చె నౌ నని
ప్రటించిరి సురలు రామద్రుని నెలమిన్.

            టీక  -  ఒకతల- ఒకవైపు

837-తే.

అంత నమృతంబు తెగిపోవ సురవిభుని
మేన బాహులుఁ దలలును మిన్న కడఁగి
పోయి కనుపట్టె నప్పు డద్భుతము గాఁగ
రెండుచేతులు నొకతల గండు మిగుల.

838-వ.

అంత దైత్యేంద్రుండు తన మనంబున.

839-క.

వ్వరు నెఱుఁగనిమర్మం
బివ్విభునకు నెఱుకపఱుప నిటు గావించెన్
వ్వమున నీవిభీషణు
క్రొవ్వెల్ల నడంతు నంచుఁ గ్రూరతతోడన్.

840-సీ.

తొల్లి వరప్రాప్తి దొరికినయటువంటి-క్తాభ మను మహాక్తి దివిచి
గంధపుష్పాక్షతలిత మై కనుపట్టి-విపుల తేజంబున వెలయుచున్న
దానిఁ బ్రయోగింప దారుణానలతీవ్ర-శిఖలు దిక్తటములఁ జెలఁగుచుండ
నఘనారవమైన ఘంటానినాదంబు- శ్రుతిపుటంబులకు నశ్రుతము గాఁగఁ

జండతరముగ నట విభీణునిపైకిఁ
జిచ్చు లుమియుచు నుగ్రమై వచ్చుదానిఁ
గాంచి రాముండు నిశితమార్గణముచేతఁ
దృణము కైవడి నడిమికిఁ ద్రెంచివైచె.

841-వ.

ఇట్లు తనశక్తి వృథ యగుటఁ గని దానవేంద్రుండు మానవేంద్రునిపైఁ గరం బలిగి నిట్టూర్పు నిగిడింపుచు నసి ముసల ముద్గర పరశు పట్టిస ప్రాస గదాదండ కోదండ భిండివాలాది సాధనంబుల నవక్ర విక్రమంబున నాలంబు సేయుచుండఁ గని విభీషణుం డులికి దేవా! వీఁడు రెండుకరంబులతోడనే మెండుగ యుద్ధంబు సేయం దొడంగె నింక శిరంబులుఁ గరంబులు మరల నుద్భవించెనేనిఁ గార్యంబు దప్పుటకు సందియంబు లేదు. కావున వీని నీలోనన బ్రహ్మాస్త్రంబున నడఁగింపఁ దగు నని విన్నవించిన.

శ్రీరాముఁడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచే రావణుహననము

842-మ.

ఘుం డుజ్జ్వలచాపదండమున బ్రహ్మాస్త్రంబు సంధించి యొ
య్యనఁ గర్ణాంతముగాఁ గడున్ దివిచి ప్రత్యాలీఢ పాదస్థుఁడై
నుజాధీశ్వరు బాహుమధ్యము వడిం దాఁకంగ లక్ష్యంబుగాఁ
గొనిబిట్టేసె నదల్చి తీవ్రతరమౌ కోపంబు దీపింపఁగన్.

843-క.

వేటు వడిగ నాటిన
రాణుఁ డతివివశుఁడగుచు వ్రాలె ధరిత్రిన్
దేతతి పొగడి యప్పుడు
పూవులవర్షంబు గురిసె భూవరు మీఁదన్.

844-ఉ.

సంరభూమి రావణుఁడు త్త్వముఁదూలి ధరిత్రిఁ గూలినన్
గ్రుంగె భరంబునన్ ధరణి క్రుంగెఁ గులాచలవర్గమెల్ల వే
గ్రుంగె దిశాకరీంద్రములు గ్రుంగె మహోరగవంశనాథుఁడున్
గ్రుంగె ఢులీకులేశ్వరుఁడు క్రుంగె వరాహము గ్రుడ్లు తేలఁగన్.

845-క.

ములకు నెల్లబాధకుఁ
గు రావణుఁ డాజిఁ గూల నంతటితోడన్
 దీఱె ననుచు రాముఁడు
గఁ దన విల్లెక్కు డించి మ్ముని కిచ్చెన్.

846-సీ.

ఖిలలోకమ్ముల కానంద మొదవెను-సురలకంటికి నిద్రసోఁకె నంత
మునులు చేసినతపంబులు చాల ఫలియించెఁ-దొడరి సాధ్యులకుఁ దుందుడుకు వాసె
గుహ్యకావళికినిఁ గూడు నోటికిఁ బోయె-సిద్ధులతలఁపులు సిద్ధి నొందె
ర్వీకరంబులల్లడం బడఁగెను-గిన్నరసంఘంబు కీడు తొలఁగె

రుడ గంధర్వ ఖేచర ణములకును
క్షేమ మింపారె జనపరిణామ మయ్యె
వేడ్క లింపొందె బాధలు విఱుగఁడయ్యె
సంగరంబున దైత్యుండు చ్చుకతన.

847-ఉ.

అం విభీషణుండు తనన్న పదంబులమీఁద వ్రాలి య
త్యం విషాదదుఃఖజనితాశ్రుకణంబులు రాల నేడ్చె లో
కాంకుఁ డైన రావణు మహాద్భుత దుష్టపరాక్రమంబు భూ
కాంతుని ముంగలన్ దడవి ద్గదకంఠ కషాయనేత్రుఁడై.

మండోదరీ విలాపము

848-వ.

అట్టి సమయంబున మందోదరి మొదలైన అంతఃపుర సుందరీ సందోహంబు లేతెంచి తమ ప్రాణేశ్వరుండైన రాక్షసకుల సార్వభౌముంగని వక్షంబులు శిరములు మోఁదుకొనుచు బహువిధంబులఁ బ్రలపించుచుఁ బరివేష్టించికొని యుండ భూకాంతుండు శాంతాలాపంబుల ననునయించి విభీషణుంగని నీవు దుఃఖం బుడిగి మీయన్నకు నగ్నిసంస్కారాది విధుల నాచరింపు మనిన నతం డట్ల కావించిన యనంతరంబ విభీషణుని లంకానగరంబునకు బట్టంబు గట్టించిన నతండు సుగంధద్రవ్యంబులును నవరత్నఖచితంబులైన భూషణంబులును జీని చీనాంబరంబులును గానుకగా నిచ్చినం బరిగ్రహించి యవియెల్లను మాతలికిచ్చి ప్రియోక్తులం దనిపి యనిపిన నతండు స్వర్గంబునకుం జనియె నయ్యవసరంబున.

విభీషణుఁడు శ్రీరాముని విజయ వార్తను సీతకు నివేదించుట

849-సీ.

లోన రాఘవుండా విభీషణుఁ జూచి-త్ప్రీతియుక్తి మై రగఁ పిలిచి
పంక్తికంధరు నాజిఁ రిమార్చితి నటంచు-సుమతీతనయకు వార్త సెప్పి
నీదేవి మొదలగు నీరజాక్షులచేత-తివకు శృంగార మరఁ జేసి
కొంచు రమ్మని చెప్ప నంచితగతి నేఁగి-రమాదిసతుల కారణిఁ జెప్ప

తులు నిర్మలజలముల లక మార్చి
ట్టుపుట్టంబు ముదమునఁ ట్టఁ బెట్టి
చందన మలంది సురభి పుష్పములు ముడిచి
మేలిమణిభూషణంబులు సాలఁ దొడిగి.

850-క.

ఇందిరతో సరి యగునా
సుంరిఁ ద్రైలోక్యమాత సొబ గొందఁగఁ దా
రంలమునఁ గొని వచ్చిరి
కంర్పనిభుండు రాముడకుం బ్రీతిన్.

సీత యగ్ని ప్రవేశము

851-వ.

ఇట్లు గొనివచ్చి రామభూపాలుని సమ్ముఖంబున నునిచిన నద్ధరాతనూజాత పతికి వినయభక్తి తాత్పర్యంబులు వెలయఁ బ్రణమిల్లిన నతండు వనితారత్నం బగు సీతం గనుంగొని యిట్లనియె.

852-క.

కుసతిఁ జెఱ గొనిపోయిన
శాత్రవు గెలువ నోపఁ ను పలుకులకున్
గెలిచితిఁ బగ చంపితి నిఁక
నెలఁతా! నీయిచ్చఁ జనుము నే నిన్నొల్లన్.

853-ఆ.

నుచుఁ బలుకుపలుకు వనీతనూజాత
ర్ణములకు వాఁడి లుగునట్టి
నారసములు సోఁకి నాటిన యట్లైన
రసిజాక్షి మూర్ఛఁ జాలి నొంది.

854-చ.

వర! నాదుచిత్తము మనంబున నీవ యెఱింగియుండియున్
రుషము లాడ నేమిటికిఁ బాపము నాయెడ లేదు కాదుపో
సులు నుతింప మేటిసొదఁ జొచ్చెద మెచ్చుఁ డ టన్న రామభూ
రుని మనం బొడంబడిన వారిజలోచన సీత యాతఱిన్.

            టీక -  సొద- చితి, కట్టెలతోపేర్చిన అగ్ని వేదిక

855-క.

హృయేశుఁ డలర నప్పుడ
సొదఁ జొచ్చెను భూమిపుత్త్రి సురలు నుతింపన్
ము మంది పద్మభవుఁడా
నం బ్రత్యక్ష మయ్యె నౌ నౌ ననుచున్.

బ్రహ్మ సీత సౌశీల్యమును బ్రస్తుతించుట

856-ఆ.

అంతఁ బద్మగర్భుఁ వనీశుఁ డగురామ
ద్రుఁ జూచి పలికెఁ “రమపురుష!
నజనేత్ర సీతలన దోసము లేదు
మ్ము వసుమతీశ! నాదుమాట.

857-వ.

అని పలికిన పితామహునిమాటల కుభయసేనలును సంతసిల్లినవి. అనంతర మగ్నిభగవానుండు నయ్యంగనం గొనివచ్చి పరమ పతివ్రతాభరణం బగు నిద్ధరాతనూజాతం గైకొమ్మని యప్పగించిన నయ్యెడ దశరథుండు ప్రసన్నుండైన శ్రీరామచంద్రుండు సతీసమేతుండై తమ్ముండును దానును నమస్కరించినఁ గుమారద్వయంబును గోడలిని నాలింగనంబుచేసి తద్దుఃఖంబులం బాపి చనియె నప్పుడు సకలదేవతలు నిట్లనిరి.

దేవతలు చేసిన శ్రీరామ స్తోత్రము

858-క.

మాకొఱకు జనన మొందితి
రాకాసులరాజుఁ జంపి క్షించితి వౌ
లోకంబు లెల్లఁ గృపతో
సాకేతపురాధినాథ! జ్జనవినుతా!

859-క.

ని వినుతి సేసి కలనన్
నిపోయిన కపుల నెల్ల త్కృప బ్రదుకుం
ని వరము లిచ్చి యరిగిరి
ను లా దేవతలు మరలి గనంబునకున్.

860-వ.

తదనంతరంబున.

861-తే.

భానుపుత్త్రాది వానరలముతోడ
నవిభీషణముఖ్యరాక్షసులతోడ
ఱియు జానకితోడ లక్ష్మణునితోడఁ
బుష్పకంబెక్కి చనియె నాభూమివిభుఁడు.

సీతా లక్ష్మణ సుగ్రీ వాదులతోఁ బుష్పక విమానమున శ్రీరాముని పయనము

862-వ.

ఇట్లు పుష్పకారూఢుండై చనుచుండి రామభూకాంతుండు కాంతారత్నంబునకుఁ జేయెత్తి చూపుచు సంగ్రామస్థలంబిదె, రావణ కుంభకర్ణాదులైన రాక్షసబలంబును మర్దించిన తా విదె, సువేలాచలం బిదె, సముద్రంబునన్‌ బంధించిన సేతుబంధనం బిదె, విభీషణుఁడు మమ్ము శరణుచొచ్చిన ప్రదేశం బిదె, సుగ్రీవుని కిష్కింధానగరం బిదె, ఋశ్యమూకాచలం బిదె, వాయుతనూభవుండు మమ్ము బొడగన్న తా విదె, పంపాసరోవరంబునిదె, కబంధుండను దానవుని వధించిన ప్రదేశం బిదె, జటాయు వను పక్షీంద్రుండు నిన్ను గొనిపోవునప్పుడు రావణాసురుని తోడంబోరి మడిసిన స్థానం బిదె, జనస్థానం బిదె, దశవదనుండు నిన్నుఁ జెఱఁ గొనిపోయిన చోటిదె, మాయామృగంబును బడనేసిన చోటిదె, ఖర దూషణాదులు నాతోడఁ బోరి పొలసిన తావిదె, శూర్పణఖ యనుదాని ముక్కు సెవులుం జెక్కిన యిక్క యిదె, సుతీక్ష్ణుండను మునీంద్రుండు వర్తించు నాశ్రమం బిదె, యగస్త్యాశ్రమం బిదె, యత్రి మహామునీంద్రుని పత్ని యనసూయాదేవి యంగరాగంబులు నీకిచ్చిన చక్కి యిదె, విరాధుం డనురాక్షసుండు నిన్నుఁ బట్టుకొనిపోవుచుండ విడిపించిన చోటిదె, చిత్ర కూటాచలం బిదె, భరతుండు మనల నొడంబఱచి మరలఁ గొనిపోవ వచ్చిన చోటిదె, గంగానది యల్లదే కనుంగొను మని చెప్పుచు భరద్వాజాశ్రమంబుఁ జేరం జని యచ్చటఁ బుష్పకంబు డిగ్గి యమ్మునీంద్రునకు నమస్కరించిన నతండు రాముని దీవించిన మహానందంబు నొంది యనిలసంభవా! వేవేగ నీవేఁగి నందిగ్రామమ్మున నున్న భరతునకు మారాక యెఱింగించి రమ్మని యనిపిన.

863-క.

రుదెంచి చూచెఁ బావని
సురుచిరసౌభాగ్యభరతు శోభనచరితున్
విచితపుణ్యస్ఫురితున్
నిరుపమసత్కీర్తి నిత్యనిరతున్ భరతున్.

864-వ.

కనుంగొని వందనంబు సేసి కరంబులు మోడ్చి వినయంబున.

865-ఆ.

రతునకును రామద్రుఁ డేతెంచిన
వార్తఁ జెప్ప వినుచు వాయుసుతుని
గారవించి నిండు కౌఁగిట జేర్చుడు
గ్రజన్ముసేమ డిగి యడిగి.

866-క.

ల్లులు మువ్వురకును రఘు
ల్లభుఁ డేతెంచినట్టి వార్తలు దెలుపన్
ల్లిదుఁ డగు తనతమ్ముని
ల్లన సాకేతపురికి నిపెన్ వేడ్కన్.

అయోధ్యా నగర ప్రవేశము

867-వ.

అట భరద్వాజాశ్రమంబున మజ్జనభోజనాదులాచరించి నాఁటి రాత్రి నిలిచి మఱునాఁ డమ్మునీంద్రుని వీడ్కొని శ్రీరామచంద్రుండు పుష్పకారూఢుండై చనుదెంచుచున్న యప్పు డన్నకు భరతుండు సకలసేనా సమేతుండై తల్లులుం దమ్ముండును నెదురేఁగి రాఘవేశ్వరు పాదారవిందంబులకు వందనం బాచరించిన నతం డనుజన్ములఁ గౌగిలించుకొని లక్ష్మణసహితుండై జనకరాజనందనం గూడి తల్లులు మువ్వురకుం బ్రణమిల్లి వార లతిస్నేహంబున నిండుకౌఁగిళ్ళ నొత్తుచు దీవింపఁ దమలోఁదాము పెద్దపిన్న యంతరువుల వందనంబులు సేసికొని మరలి నందిగ్రామంబున కేఁగి యచ్చటఁ బుష్పకంబు డిగ్గి దాని కర్చన లిచ్చి కుబేరుని వీటికిఁ బొమ్మని యనిపి భరతు మందిరంబు ప్రవేశించె నట్టి శుభసమయంబున.

868-క.

దానంబు లిచ్చి భద్ర
స్నానంబులు సేసి భూషణంబులు పూఁతల్
చీనాంబరములుఁ బరిమళ
సూనంబులుఁ దాల్చి రధికశోభనలీలన్.

869-వ.

ఇట్లు రామాది సోదరచతుష్టయంబును భూమినందనయును దపోవేషంబు లుజ్జగించి, రాజచిహ్నంబులు గైకొని, దానవ వానరబలంబులం గూడుకొని, షడ్రసోపేతంబులైన భోజనంబులం బరితృప్తులై, యారాత్రి గడపి మఱునాఁడు గజతురగస్యందనాది వాహనంబు లెక్కి, ఛత్రచామరాదులు మెఱయ శంఖభేరీభాంకారంబు లుల్లసిల్ల వందిమాగధుల బిరుదుకైవారంబులు సెలంగ నయోధ్యాపురంబుఁ బ్రవేశించి, నగరులోనికిఁ జొత్తెంచి, వసిష్ఠానుమతంబున శుభముహూర్తంబున భద్రసింహాసనంబునఁ బట్టభద్రుండై, రామచంద్రుండు భూసురులకు దానంబు లొసంగి, యర్థార్థుల కిష్టార్థంబు లిచ్చి, విభీషణ సుగ్రీ వాంగద జాంబవ ద్ధనుమదాదులఁ బ్రియవచనంబులం దనిపి, వారివారికిం దగిన పగిదిని గట్నంబులిచ్చి వీడ్కొలిపిన వారు నిజస్థానంబులకుం జని రంత మహానందంబున.

870-ఆ.

శ్వమేధయాగ న నొప్పు జన్నంబు
నెలమిఁ జేసి దివిజు లెల్ల మెచ్చ
లీలఁ బదునొకండు వేలేండ్లు ధరయేలెఁ
రమధర్మమహిమఁ బ్రజలు వొగడ.

శ్రీరాముని ధర్మ పరిపాలనము

871-సీ.

కలౌషధక్రియాసంజీవకరణిచేఁ-జెలఁగి దిక్కులను రక్షింపఁజాలు
బంధురోన్నతశస్త్రసంధానకరణిచేఁ- గుటిలారులను రంభ గూర్పఁ జాలు
సంతతోత్పాదనసౌవర్ణ కరణిచే- ర్థులదారిద్ర్యడఁపఁజాలు
నుదిన సంధాన నుశల్యకరణిచేఁ- బురుషార్థనికరంబుఁ బ్రోవఁజాలు

సిద్ధి విద్యానురాగ ప్రసిద్ధుఁడైన
రాజచంద్రుఁ డితండని రాజు లెల్ల
న్నుతింపఁగ విలసిల్లె గతియందు
భాగ్యవిస్తారి రామభూపాలశౌరి.

872-సీ.

కుటిలత నదులందుఁ గుంతలంబులయందు-బొంకు జూదములందు బూతులందు
లేమి వైరులయందు లేమలనడుమందు-భంగ మంబుధులందుఁ రులయందుఁ
గోపంబు ఖలులందుఁ గ్రూరవర్తనులందు-డఁకు వీణలయందు వ్యసనులందు
బంధంబు రతులందుఁ టుశిరోజములందు-మోహంబు ధనమందు ముదితలందు

జింత కవులందుఁ దపసులచిత్తమందు
ర్ణమిళితంబు చిత్తరువందు యవను
లందుననె కాని యెండెడఁ జెందకుండ
లీల ధర యేలె రామభూపాలవరుఁడు.

ఫల శ్రుతి

873-క.

 రామచరిత మెప్పుడు
వాక విన్నట్టివారు వ్రాసినవారున్
గోరి పఠించినవారును
శ్రీరాముని కరుణ మేలు సెందుదు రెలమిన్.

ఆశ్వాసాంత పద్య గద్యములు

874-క.

జాక్ష! భక్తవత్సల!
జాసనవినుతపాదలజాత! సుధా
రాశిభవ్యమందిర!
జాకరచారుహంస! జానకినాథా!

875-మాలిని.

కులయదళనేత్రా! కోమలస్నిగ్ధ గాత్రా!
ముఖనుతిపాత్రా! క్తవృక్షాళిచైత్రా!
విశశిసమధామా! క్షితాక్షాంఘ్రిభామా!
విజననుతనామా! కావుమా మమ్ము రామా!

876-గ.

ఇది శ్రీ గౌరీశ్వర వర ప్రసాద లబ్ధ గురు జంగమార్చన వినోద సూరి జన వినుత కవితా చమత్కారాతుకూరి కేసనసెట్టి తనయ మొల్ల నామధేయ విరచితంబైన శ్రీ రామాయణ మహా కావ్యంబునందు యుద్ధకాండము సర్వంబు.

 

సర్వం శ్రీమద్రామార్పణ మస్తు.

ఓం

ఓం శాంతిః శాంతిః శాంతిః

లోకాసమస్తా సుఖినో భవంతు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Intro

 Ramayana is a Sanskrit epic ithihasa, that happened like this, story of Indian Subcontinent. It finely reflects the Indian values to fulles...