అవతారిక

 

ఇష్టదేవతా సన్నుతి

1-ఉ.

శ్రీ హిమాభిరాముఁడు,శిష్ఠ మహాముని పూజితుండు, సు

త్రా వధూ కళాభరణ క్షకుఁ డాశ్రిత పోషకుండు, దూ

ర్వాల సన్నిభాంగుఁడు,హా గుణశాలి, దయా పరుండు, శ్రీ

రాముఁడు ప్రోచు భక్తతతి రంజిలు నట్లుగ నెల్ల కాలమున్.

 టీక : సుత్రాముడు - ఇంద్రుడు

2-ఉ.

శ్రీగ మందిరుం, డమర సేవితుఁ, డర్థ శశాంక మౌళి,

న్మౌని మనఃపయోజ దిననాయకుఁ, డబ్జభవామరేశ్వర

ధ్యా లసత్ప్రసన్నుఁ డతి న్యుఁడు, శేష విభూషణుండు, వి

ద్యానిధి, మల్లికార్జునుఁడుతా నిడు మాకు శుభంబు లొప్పఁగన్.

 టీక : శ్రీనగమందిరుడు - శ్రీశైలనివాసుడు

3-ఉ.

తెల్లని పుండరీకముల తేజము మెచ్చని కన్నుదోయితో

ల్లని శక్రనీల రుచి వ్వెడు కోమల దేహ కాంతితో

ల్లనఁ బిల్లఁ గ్రోవి కర మంచిత సంజ్ఞల నింపు నింపఁగా

గొల్లతలన్ విరాళి తగఁ గొల్పెడు కృష్ణుఁడు ప్రోచుఁగావుతన్.

 టీక : శక్రనీలము - ఇంద్రనీలము

4-ఉ.

మించిసమస్త లోకములు మిన్నక తాఁ దన నేర్పు మీఱ ని

ర్మించిప్రగల్భతన్ మెఱసిమేలును గీడును బ్రాణికోట్లు సే

విం ఘటించి శాస్త్రములువేదములుం గొనియాడుచుండు నా

కాంనగర్భుఁ డిచ్చు నధికంబుగ నాయువు నీప్సితార్థముల్.

 టీక : కాంచనగర్భుడు - హిరణ్యగర్భుడు, బ్రహ్మదేవుడు; మిన్నక - ఊరక

5-సీ.

చంద్రఖండకలాపుఁ జారువామనరూపుఁ- లితచంచలకర్ణుఁమలవర్ణు,

మోదకోజ్జ్వలబాహుమూషకోత్తమవాహు- ద్రేభవదను,ద్భక్తసదను,

న్మునిస్తుతిపాత్రుశైలరాడ్దౌహిత్రు- నుదినామోదు, విద్యా ప్రసాదుఁ,

రశువరాభ్యాసుఁబాశాంకుశోల్లాసు- నురుతరఖ్యాతు, నాగోపవీతు,

లోకవందితగుణవంతు నేకదంతు

తులహేరంబు, సత్కరుణావలంబు,

విమలరవికోటితేజు, శ్రీవిఘ్నరాజుఁ

బ్రథిత వాక్ప్రౌఢి సేవించి ప్రస్తుతింతు.

 టీక : చంద్రఖండకలాపుడు - చంద్రవంక అలంకరించుకున్నవాడు; భద్రేభవదనుడు - భద్రగజ ముఖము కలవాడు; శైలరాడ్దౌహిత్రుడు - కైలాసపర్వతుని మనుమడు; నాగోపవీతుడు - సర్పము జంధ్యముగా కలవాడు;

6-చ.

రిముఖుఁడుం, గుమారుఁడు వికారపుఁ జేఁతల ముద్దు సూపుచున్

గురువులువాఱుచున్ సరిగ గుట్టలు దాటుచుఁ చన్నుదోయితో

శిములు రాయుచుం గబరిఁ జేర్చిన చంద్రునిఁ బట్టి తీయఁగాఁ

ములఁ జాఁప నవ్వెడు జమ్ముల తల్లి శుభంబు లీవుతన్.

 టీక : కరిముఖుడు - విఘ్నేశ్వరుడు; కుమారుడు - కుమారస్వామి;

7-ఉ.

సాజయుగ్మ మింపలరఁ ల్లని నీరు పసిండికుండలన్

వేఱు వంచి వంచి కడు వేడుకతో నభిషిక్తఁ జేయఁగాఁ

దారపువ్వు గద్దియ ముదంబున నుండెడి లోకమాత మా

కాముని తల్లి సంపద లఖండముగా నిడు మాకు నెప్పుడున్.

 టీక : సాయజయుగ్మము - ఏనుగుల జంట.

8-ఉ.

మేలిమి మంచు కొండ నుపమింపఁగఁజాలిన యంచ నెక్కి, వా

హ్యాళి నటించి వచ్చు చతురాస్యు నెదుర్కొని నవ్వు దేరగా

వాలిక సోగ కన్నుల నివాళి యొనర్చి, ముదంబు గూర్చు వి

ద్యా, వాణి శబ్దముల ర్థములన్ సతతంబు మాకిడున్.

 టీక : అంచ - హంస వాహ్యాళి - విహారము, వాహనంపై తిరుగుట, విద్యాలయ - సరస్వతీదేవి.

సంస్కృతాంధ్ర మహాకవి స్తుతి

9-సీ.

సురసన్నుతజ్ఞాను సువివేకి వాల్మీకి- ఖిలవేదాగమాభ్యాసు వ్యాసు,

ఘోరాంధకార ప్రభారవి భారవి- త్కాంతిహిమకరశ్లాఘు మాఘు,

వివిధకళాన్వితవిఖ్యాతి భవభూతిఁ- బ్రకటకార్యధురీణు ట్టబాణు,

మానినీలోకసమ్మదముద్రు శివభద్రుఁ- వితారసోల్లాసుఁ గాళిదాసు,

స్తుతగుణోద్దాము నాచన సోము, భీము

వ్యమంజులవాగ్ధుర్యు న్ననార్యు,

సికుఁడైనట్టి శ్రీనాథురంగనాథుఁ

దిక్కకవిరాజు, భోజు నుతించి మించి,

10-క.

తొల్లిటి యిప్పటి సత్కవి

ల్లభులను రసిక వినుత వాగ్విభవ కళా

ల్లులఁ గవితా రచనల

ల్లిదు లైనట్టి ఘనుల క్తిగఁ దలతున్.

మొల్ల కవితా విలసనము

11-క.

గురు లింగ జంగమార్చన

రుఁడును, శివభక్తిరతుఁడుబాంధవహితుఁడున్

గురుఁడాతుకూరి కేసయ

పుత్రిని మొల్ల యనఁగ ఱలినదానన్.

12-సీ.

దేశీయపదములు దెనుఁగులు సాంస్కృతుల్- సంధులు ప్రాజ్ఞుల బ్దవితతి

య్యలు రీతులుఁ జాటు ప్రబంధంబు- లాయా సమాసంబు ర్థదృష్టి

భావార్థములుఁ గావ్యరిపాకములు రస-భావచమత్కృతుల్ లుకుసరవి

హువర్ణములును విక్తులు ధాతుల-లంకృతి చ్ఛందో విక్షణములుఁ

గావ్య సంపద క్రియలు నిఘంటువులును

గ్రమములేవియు నెఱుఁగ, విఖ్యాత గోప

రపు శ్రీకంఠమల్లేశు రముచేత

నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుకొంటి.

 టీక : దేశీయ - ప్రాంతీయ యాస;శయ్య - పదగుంఫనము; పలుకుసరవి - పలికెడి విధానము, క్రమము; క్రమములు - నేర్పులు.

13-క.

చెప్పుమని రామచంద్రుఁడు

సెప్పించిన పలుకుమీదఁ జెప్పెద నే నె

ల్లప్పుడు నిహ పర సాధన

మిప్పుణ్య చరిత్ర తప్పు లెంచకుఁడు కవుల్!

14-వ.

అని మఱియును.

15-చ.

లిపపు సన్న పయ్యెదను వాసిగ గందపుఁ బూఁతతోడుతన్

గొదిగఁ గానవచ్చు వలి గుబ్బ చనుంగవ ఠీవి నొప్పఁగాఁ

దెలుఁ గని చెప్పుచోటఁ గడుఁ దేటలఁ మాటలఁ గ్రొత్త రీతులం

బొలుపు వహింపకున్న, మఱి పొందగునే పటహాదిశబ్దముల్?

 టీక : వలిపపు - పరిశుద్ధమైన, తెల్లనైన; వలి - కడుపుమీఁది ముడుత; పొలుపు - చక్కదనము.

16-క.

మును సంస్కృతములఁ దేటగఁ

దెనిఁగించెడిచోట నేమి దెలియక యుండన్

 విద్య మెఱయఁ గ్రమ్మఱ

 మగు సంస్కృతముఁ జెప్పఁగా రుచి యగునే?

17-ఆ.

తేనె సోఁక నోరు తీయన యగు రీతిఁ

దోడ నర్థ మెల్లఁ దోఁచకుండ

గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము

మూఁగ చెవిటివారి ముచ్చ టగును.

18-క.

కందువ మాటలు, సామెత

లంముగాఁ గూర్చి చెప్ప ది తెనుఁగునకున్

బొందైరుచియై, వీనుల

విందైమఱి కానుపించు విబుధుల మదికిన్.

 టీక : కందువ - చమత్కారము.

19-వ.

అని మఱియును.

రామ కథా సుధా మాధురి

20-క.

ది రఘురాము చరితము

నారముగ విన్నఁ గ్రొత్తయైలక్షణ సం

పామ్మై, పుణ్యస్థితి

వేమ్మై తోఁచకున్న వెఱ్ఱినె చెప్పన్?

21-ఉ.

రాజితకీర్తియైన రఘురాముచరిత్రము మున్ గవీశ్వరుల్

తేమెలర్పఁ జెప్పిరని తెల్సియుఁ గ్రమ్మఱఁ జెప్పనేలనన్

భూన కల్పకంబనుచుభుక్తికి ముక్తికి మూలమంచు, నా

రాజును దైవమైన రఘురాము నుతించినఁ దప్పుగల్గునే?

22-క.

వారాంగన శ్రీరాముని

పేరిడి రాచిలుకఁ బిలిచి పెంపు వహించెన్

నేరుపు గల చందంబున

నా రాముని వినుతి సేయ ర్హము గాదే?

23-క.

నేరిచి పొగడినవారిని,

నేక కొనియాడువారి నిజ కృప మనుపం

గాణ మగుటకు భక్తియె

గాణ మగుఁ గాని చదువు కారణ మగునే?

24-ఉ.

ల్లలితప్రతాపగుణసాగరుఁడై విలసిల్లి, ధాత్రిపై

ల్లిదుఁడైన రామనరపాలకునిన్ స్తుతిసేయు జిహ్వకున్

జిల్లరరాజలోకమును జేకొని మెచ్చఁగ నిచ్చపుట్టునే?

ల్లము బెల్లముం దినుచు ప్పటి కప్పటి కాససేయునే?


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Intro

 Ramayana is a Sanskrit epic ithihasa, that happened like this, story of Indian Subcontinent. It finely reflects the Indian values to fulles...