కిష్కింధ కాంఖ

కిష్కింధ కాండము

243-క.

క్షీంద్రవాహ! కుజ ప్ర

త్ర్యక్షమనోబ్జాతగేహ! పహృతమోహా!

రాక్షసభీమా! మునిజన

సాక్షాత్కృతనైజధామ! జానకిరామా!

 టీక : కుజ - సీతాదేవి

244-వ.

శ్రీ నారద మునీశ్వరుండు వాల్మీకి మహామునీశ్వరున కెఱింగించిన తెఱం గెఱింగించెద నాకర్ణింపుము,

సుగ్రీవుని పంపున రామ లక్ష్మణుల సన్నిధికి హనుమంతుని రాక

245-సీ.

పంపాతటమ్మున బాణాసనాయుధ-పాణులై యున్న భూపాలసుతులఁ

నుగొని భీతిల్లిమలాప్తసూనుండు-వాలి పంపున వీరు చ్చి రనుచుఁ

లఁగి, తా ఋష్యమూకంబున నుండగ-వెఱచి, మలయశైల విపినసీమఁ

దిరిగి, వారల రాక తెఱఁగెల్లఁ దెలిసి రా -వనాత్మజుని వేగఁ బం, నతఁడు

చ్చి రఘురాము శ్రీపాద వారిజముల

ర్థిఁ బ్రణమిల్లి, “మీ రెవ్వ య్య? యిటకు

నేమి కతమున వచ్చితిరేది నామ?”

నుచు నడిగిన సౌమిత్రి తని కనియె.

246-సీ.

శరథుం డను రాజు నయుల, మాతని-పంపునఁ దపమాచరింపఁ గోరి

చ్చి, కాననభూమి ర్తించుచుండ, నీ-రాజు దేవిని దుష్ట రావణుండు

కుటిల వృత్తిని నెత్తుకొని పోవ, నా జాడ-వదలక దిక్కులు వెదకి వచ్చి,

బరికి మా రాక చందంబుఁ దెలియంగఁ-జెప్పిన, నర్కజుచేతఁ గాని

మీదు కార్యంబు నెగ్గదుమీర లరిగి

వేగ సుగ్రీవు చెల్మి గావింపుఁ డనిన

చ్చినారము గనుఁగొన లసి యతని,

తఁడు రాముండు, లక్ష్మణుం డండ్రు నన్ను.

 టీక : అర్కజుడు - సూర్యుని వలన కలిగిన పుత్రుడు, సుగ్రీవుడు

247-తే.

లఁప నీ రాజునకు నెందు ధాత్రిలోన

విను మసాధ్యంబు లైనట్టి పనులు లేవు,

సూర్య వంశోత్తముఁడు మహా శూరుఁ డితఁడు,

నీకుఁ బేరేమి చెప్పుమా మాకు” ననిన,

248-తే.

వాయుదేవుని బ్రార్థించివేయి గతుల

నంజనాదేవి గాంచిన యాత్మజుండ,

ర్కజుని మంత్రినై యుందు నుదినంబు,

వినుఁడు నా పేరు హనుమంతుఁ డనుదు రిలను.”

249-వ.

అని చెప్పి మఱియు నిట్లని విన్నవించె

250-చ.

వినుఁడు మహాత్ములార! యరవిందహితాత్మజుఁ దోడితెచ్చి, మి

మ్మును బొడఁగానుపింతు” నని మ్రొక్కుచు నేఁగి, కపీంద్రుఁ జేరి, తాఁ

నిన తెఱంగు, వారిఁ గను చందము నేర్పడఁజెప్పి, గొబ్బునన్

నిగొనివచ్చి, రాము పదపంకజముల్ గనిపించె నంతటన్.

 టీక : అరవిందహితాత్మజుడు - సూర్యుని వలన కలిగిన పుత్రుడు, సుగ్రీవుడు

శ్రీరామ సుగ్రీవుల మైత్రి

251-వ.

సుగ్రీవుండు శ్రీరామచంద్రుని పగతీర్పఁ దా భారంబు వహించి, తనకుఁ బగవాఁడైన వాలిని జంపింపం దలంచి, వానితోఁ దనకుఁ గలిగిన పూర్వవైరంబు తెఱంగు శ్రీరామునకుఁ దెలియవిన్నవించి, వాలి మహా సత్త్వశాలి, యతండు రామునిచేతం దెగుట తెల్లంబుగా, దుందుభి కళేబరంబును బది యోజనంబుల దూర మెగురఁజిమ్ముటయును, సప్తతాళంబు లొక్క బాణంబునఁ దెగవ్రేయుటయును జూచి, సుగ్రీవుండు భయకంపిత హృదయుండై, రాఘవేశ్వరుల పాదారవిందంబులకు వందనం బాచరించి, జనకనందన మున్ను జాఱవిడిచిన యాభరణంబుల మూటఁ దెప్పించి, చూపినం జూచి మూర్ఛిల్లి, గొబ్బునం దెలిసి, యర్కకులేశ్వరుండైన శ్రీరామచంద్రుం డర్క సంభవుండైన సుగ్రీవునితో నిట్లనియె,

 టీక : తెల్లంబు కాన్- స్పష్టమగునట్లు,   దుందుభి- మయుని రెండవ కొడుకు. మండోదరి సహోదరుఁడు. వాలిచే చంపఁబడెను, అర్కుడు- సూర్యుడు

252-క.

 నీ కెక్కడి దింకను

చర! నగభేదిసుతుని నా యస్త్రమునన్

దెనేయుదు నమ్ము మనుచు

దీశుఁడు పలుక నతఁడు సంతోషించెన్.

 టీక : నగభేదిసుతుడు - ఇంద్రుని వలన కలిగిన పుత్రుడు, వాలి

253-వ.

ఇట్లు ప్రమాణ వచనంబుల నయ్యచలచరాగ్రణి స్వాంతంబును సంతోషింపఁ జేసిన, నతండును శ్రీరామచంద్రుని కార్యంబునకు సహాయుండై యుండ నొడంబడి, యమ్మహానాయకుని యనుమతంబున యుద్ధ సన్నద్ధుండై, కిష్కింధా నగరంబునకుం జని, తద్ద్వారంబున నిలిచి సింహనాదంబుఁ జేసినం, గనలి యా దేవేంద్ర తనూభవుండు సనుదెంచె, నంత నయ్యిరువురుం గదిసి, భుజంబు లప్పళించుచు గర్వాలాపంబు లాడుచు నొండొరు మార్కొని,

వాలి సుగ్రీవుల కయ్యము

254-శా.

శైలంబుల్ కడు వేగ ఱువ్వుచు, మహా ఝంకార హుంకారముల్

చాలం జేయుచు, భీకరోద్ధతులచే సాలంబులన్ వ్రేయుచున్,

వాలాగ్రంబుల మోదుచున్, వడివడిన్ క్త్రంబులన్ రక్తముల్

కూలన్వాలియు సూర్య సూతియు వడిం గోపాత్ములై పోరఁగన్

255-వ.

అట్టి సమయంబున,

రాముఁ డొక్క కోలతో వాలిని గూలనేయుట

256-ఉ.

సాము పొంత నిల్చి రఘుత్తముఁ డమ్మరివోసి, శబ్ద వి

న్మూముగాఁగ విల్ దివిచిముష్టియుఁ దృష్టియు గూర్చి, గోత్రభృ

త్కూము వజ్రపాతహతిఁ గూలు విధంబునఁ గూల నేసె న

వ్వాలిఁబ్రతాపశాలి, మృదువంచనశీలి, సురాలి మెచ్చఁగన్.

257-క.

లిమిఁ బొంచియు రఘుపతి

పాలిత కపిరాజ్యశాలిఁ బ్రస్ఫుట కీర్తిన్

శూలి పద భక్తి శీలిని

వాలిన్నొక కోల నేలఁగూలఁగ నేసెన్.

258-వ.

తదనంతరంబున,

సుగ్రీవునకు వానర రాజ్య పట్టాభిషేకము

259-క.

తారాపతి శిక్షింపుచుఁ

దారాపతి ధవళ కీర్తిఁ గు నర్కజునిన్

దారాదేవికిఁ, బురి కా

తారార్కము గాఁగ రాజ నయుఁడు నిల్పెన్.

 టీక : తారాపతి - 1. తార యొక్క భర్త, 2. చంద్రుడు

260-క.

నిగ్రహము మాని నృపతి శు

గ్రహ లగ్నంబునందుఁ ట్టము గట్టెన్

నిగ్రహ రాజోపగ్రహు

సుగ్రీవుని, హేమదామ సుగ్రీవుఁ దగన్.

261-వ.

ఇట్లు సుగ్రీవుని గపి రాజ్య పట్టభద్రునిం జేసి, వాలి తనూసంభవుని నంగద కుమారుని యువరాజ పదంబున నిలిపె. నంత వర్షాకాలము గడుచునంత దనుక శ్రీరాముని మాల్యవంతంబుపై నుండ నియమించి వారు సని రయ్యవసరంబున.

వర్షాగమ వేళ శ్రీరామ సీతా వియోగ పరితాపము

262-సీ.

బ్రహ్మాండ మగలంగఁ టపటధ్వనులతో-నుఱుము లంతంతకు నుఱుము చుండఁ,

డు భయంకరముగా డ మ్రోగు మ్రోఁతలఁ-బిడుగు లాడాడ గుభిల్లు మనఁగఁ,

గ్రముకంబు లంతేసి ణములతోఁ గూడఁ-రుడు గట్టిన వడగండ్లు రాలఁ,

గొఱివిదయ్యంబుల మఱిపించు తెఱఁగున-విద్యుత్ప్రకాశమ్ము విస్తరిల్ల,

ముసుఁగువేసిన చందాన మొగులు గప్పి

మీఱి నలుపెక్కి చీఁకట్లు కాఱుకొనఁగ,

మించి కడవల నుదకంబు ముంచి తెచ్చి

క్రుమ్మరించిన గతి వాన కురిసె నపుడు.

 టీక : వడ - అతలకుతలము, క్రముకము - ప్రత్తికాయ, కరుడుకట్టు - ముద్దకట్టు, ఘనీభవించు

263-క.

ఱులు కాల్నడ తప్పఁగఁ

బాఱెను, సస్యములు పండెల వృక్షములున్

మీఱి ఫలించెను, ధరఁ బా

లేఱులుగా సురభు లెల్ల నెప్పుడుఁ బితికెన్.

 టీక : కాలనడ - కాలినడక

264-వ.

అంత వర్షాకాలాంతంబు గాఁగ నమ్మహీకాంతుండు ప్రేయసీ వియోగ పరితాపానలంబునఁ బొరలుచు నోర్వలేక విభ్రాంత స్వాంతుండై యుండ,

265-సీ.

లుమాఱు నీ హస్త ల్లవంబులచేత-లివేణి! నా తాప మార్పవేల?

ళినాక్షి! పరిరంభక్రీడఁ దేల్చు నీ-ది నొప్పి నా నొప్పి మాన్పవేల?

చెలియ! యోష్ఠామృత సేవకై నీ యల్క-డిఁ దప్పి నా దప్పి డపవేల?

భామ! తాపానల రితాప ముడుప నీ-తనువు నా తనువునఁ బెనఁచవేల?

నుచు సీతఁ బిలుచునందంద పరికించు,

దిక్కు లాలకించునిక్కి చూచు,

శరథాత్మజుండు న్నుఁ దా మఱచుచు

యలు కౌఁగిలించుఁ లువరించు.

266-వ.

అని మఱియును,

267-ఉ.

కూలు నోటికిన్ రుచులు గూడుట దప్పెను, దుంపదూఁడులుం

గాము తోఁచె, జిహ్వకును మ్మని తేనెలు చేఁదు లయ్యెఁ, గం

గాయెఁ జిత్తమంతయునుగంటికి నిద్ర రహింపదయ్యె శృం

గా మెలర్ప సీతఁ బొడఁగానమి, రామనృపాల మౌళికిన్.

 టీక : రహించు - ఒప్పు, వర్థిల్లు

268-ఉ.

తాలిమి తూలిపోయి పరితాపమునం దిరుగాడు, నొక్కచోఁ

గాలును నిల్వఁ ద్రొక్క నధికారము చాలక యెప్పుడుం గడున్

జాలి వహించుఁ, జిత్తమునఁ జంచలతం గను, భూమిపుత్త్రిపై

మేలిమిఁ జేసి రాముఁడట మిన్నక వేదురు గొన్న కైవడిన్.

సుగ్రీవుఁడు సీత నన్వేషింప వానర వీరులను నలు దెసలకుఁ బంపుట

269-వ.

ఇట్లు విరహ తాపంబునఁ బొరలుచున్న సమయంబునఁ గార్తిక మాసంబు సనుదెంచిన, శ్రీరామచంద్రుండు బలంబులం గూర్చు కొని రమ్మని సుగ్రీవు పాలికి సౌమిత్రి ననుప, నా రాము తమ్ముని గూడి యినజుండు తారా సమేతుండై చనుదెంచి, రాఘవేశ్వరుల చరణారవిందమ్ములకు నమస్కరించి, తన బలంబులఁ దోడు సూప దొడంగె నెట్లనినఁ బదులును, నూఱులును, వేలును, బదివేలును, లక్షలును, బది లక్షలును, గోట్లును, శత కోట్లును, నర్బుదంబులును, న్యర్బుదంబులును, ఖర్వంబులును, మహా ఖర్వంబులును, బద్మంబులును, మహా పద్మంబులును, క్షోణులును, మహాక్షోణులును, శంఖంబులును, మహా శంఖంబులును, క్షితులును, మహా క్షితులును, క్షోభంబులును, మహా క్షోభంబులును, నిధులును, మహా నిధులును, సాగరంబులును, మహా సాగరంబులును, బరిమితంబులును, మహా పరిమితంబులును, ననంతంబులును, మహానంతంబులును గడచి లెక్కకు మిక్కిలి యెక్కువయై, డెబ్బదిరెండు వెల్లువలు గల కపి బలంబుతోడఁ దోడు సూపినం జూచి, రాఘవేశ్వరుండు సంతోషించి, సవితృనందను గారవించి కౌఁగిలించుకొని, సీతాన్వేషణంబుఁ జేయఁగల వానరోత్తముల నధిక బలయుతుల నేర్పఱిచి దిశలకుం బంపు మనవుడుఁ దూర్పునకు మైందుండును, బశ్చిమంబునకు సుషేణుండును, నుత్తరంబునకు శతబలియు ననువారిని నేర్పఱించి, వారలకుఁ దోడుగా వానరవీరులను లక్ష లక్ష సంఖ్యాకుల నేర్పఱించి యిచ్చి, జానకి యున్న చొప్పును దెలిసి, యొక్క నెలలో రండని యనిపి, హనుమంతునిం బిలిచి, "నీవు దక్షిణమ్మునకుం బొ" మ్మని యనుపునపుడు, శ్రీరామ భూపాలుండు వాని విశ్వాసాది గుణమ్ములకు మెచ్చినవాఁడై దగ్గఱగాఁ బిలిచి, నీవు శౌర్యవంతుండవు, హితుండవును గావున నీచేత మత్ప్రయోజనం బీడేఱు నని పలికి, తన చేతి యంగుళీయకం బతని చేతి కిచ్చి, యీ ముద్రిక జనకరాజ నందనకు సమర్పించి, యా జానకీశిరోరత్నంబు మా కానవాలుగాఁ దెమ్మని యనుప, నతం డియ్యకొని మ్రొక్కిన నాతనికిఁ దోడుగా నంగద జాంబవదాదులం గూర్చి యనిపె. ననుటయు విని నారదుని వాల్మీకి మహా మునీశ్వరుం డటమీఁది కథావిధానం బెట్టిదని యడుగుటయును.

 టీక : వెల్లువ – 36,691,71,39,200 మంది (సుమారు 36వేల 700 కోట్లు) సైన్యాన్ని వెల్లువ అంటారు. ఇలాంటి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది. అంటే 366917139200 X 70 – 2.56,84,239,97,44,000 మంది (రెండున్నర కోటి కోట్లు) వానర వీరులు సుగ్రీవుని దగ్గర వుండేవారు. వీరికి నీలుడు అధిపతి. {https://telugubhagavatam.org/?Details&Branch-anuyuktaalu&Fruit-akshauhiNi_Definitation}

ఆశ్వాసాంత పద్య గద్యములు

270-క.

జాక్ష! భక్త వత్సల!

జాసన వినుత పాద లజాత! సుధా

రాశి భవ్య మందిర

జాకర చారు హంస! జానకి నాథా!

271-గ.

ఇది శ్రీ గౌరీశ్వర వరప్రసాద లబ్ధ గురుజంగమార్చన వినోద సూరిజన వినుత కవితాచమత్కా రాతుకూరి కేసనసెట్టి తనయ మొల్ల నామధేయ విరచితంబైన శ్రీ రామాయణ మహాకావ్యంబునం గిష్కింధా కాండము సర్వము నేకాశ్వాసము

1 కామెంట్‌:

Intro

 Ramayana is a Sanskrit epic ithihasa, that happened like this, story of Indian Subcontinent. It finely reflects the Indian values to fulles...